Thaman: త‌న మ్యూజిక్‌పై వ‌స్తున్న ట్రోల్స్‌కు స్పందించిన త‌మ‌న్‌..

Thaman: ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ ప‌లు భాష‌ల్లో మ్యూజిక్ ఇస్తూ సంగీత ప్రియుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాడు. తాజాగా ఆయ‌న మ్యూజిక్ అందించిన వ‌కీల్‌సాబ్ నుంచి స‌త్య‌మేవ జ‌య‌తే సాంగ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో అల‌రిస్తోంది. కాగా ఈ క్ర‌మంలో ఈ సాంగ్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. ఈ సాంగ్ సినిమాలోనా.. రాజ‌కీయాల్లోనా అని అంటున్నారు.. అలాగే ఈ సాంగ్ కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో Thaman త‌మ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కొంత స‌మ‌యం నెటిజ‌న్ల‌తో చాట్ చేశారు. ఇందులో భాగంగానే త‌ర్వాత ప్రాజెక్ట్‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చాడుThaman.

ఆయ‌న మ్యూజిక్ అందిస్తున్న స‌ర్కార్ వారి పాట నుంచి క‌చ్చితంగా మీకెన్నో స‌ర్‌ప్రైజ్‌లు వ‌స్తాయి. ఇటీవ‌లే ఆ సినిమా షూట్ ప్రారంభ‌మైంది.. వ‌చ్చే ఏడాదిలో రిలీజ్ కాబ‌ట్టి.. సర్‌ప్రైజ్‌లు కోసం కొంత స‌మ‌యం వేచి ఉండండి అని ఆగ‌ష్టులో త‌ప్ప‌కుండా క‌లుసుకుందాం అంటూ త‌మ‌న్ అన్నాడు. అలాగే త‌న సంగీతంపై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌ట్రోలింగ్స్‌పై తాను ప‌ట్టించుకుని త‌న స‌మ‌యాన్ని వృథా చేసుకోన‌ని చెప్పుకొచ్చాడు.. త‌న సంగీతంపై ట్రోల్స్ సృష్టించ‌డం కోసం నెటిజ‌న్లే వారి స‌మ‌యాన్ని వృథా చేసుకుంటున్నార‌ని అన్నాడుThaman.