హాలీవుడ్‌లోకి టాప్ డైరెక్టర్

డైరెక్టర్లకు భాష, ప్రాంతంతో సంబంధం లేదు. ఏ భాషలోనైనా సినిమా తీయవచ్చు. సినిమాలకు భాష, ప్రాంతంతో సంబంధం లేదు. సినిమా నచ్చితే ఏ భాష సినిమానైనా సినీ ప్రేక్షకులు చూస్తారు. సినీ హీరోయిన్లు, నటులే కాదు డైరెక్టర్లు కూడా వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా తాజాగా తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాపులర్ అయిన డైరెక్టర్ మురుగదాస్ హాలీవుడ్‌లో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

MURUGUDAS

వాల్ డిస్నీ సంస్థ నిర్మించే ఒక సినిమా కోసం మురుగదాస్ పనిచేయనున్నట్లు సమాచారం. తుపాకీ, కత్తి, సర్కార్ ద్వారా తమిళ స్టార్ హీరో విజయ్‌తో మరో సినిమా చేయాలని మురుగదాస్ అనుకున్నాడు. ఈ మేరకు విజయ్‌కి కథ కూడా చెప్పాడు. కానీ విజయ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది.

ప్రస్తుతం మురుగదాస్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. దీంతో ఆయన హాలీవుడ్ వైపు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు.