అక్రమ కార్ల రిజిస్ట్రేషన్ కేసులో ప్రముఖ కమెడియన్‌కు పోలీసులు నోటీసులు

బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ అంటేనే వివాదాలు. ఆయన ఎప్పుడూ ఏదోక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. గతంలో ముంబైలో ఇంటికి సంబంధించిన కేసులో అతడు చిక్కుకోగా.. తాజాగా మరో కేసులో చిక్కుకున్నాడు. ఒకవైపు సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా కపిల్ శర్మ రాణిస్తున్నాడు. ది కపిల్ శర్మ షోతో అతడు బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్నాడు.

mumbai police kapil sharma

తాజాగా కారు రిజిస్ట్రేషన్ నెంబర్ల ఫోర్జరీ కేసులో కపిల్ శర్మ చిక్కుకున్నాడు. ఈ కేసులో కపిల్ శర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వాలని పోలీసులు కోరారు. అక్రమ కార్ల రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన కేసులో ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కపిల్ శర్మ దిలీప్ చాబ్రాకు వ్యానిటీ వ్యాన్ తయారు చేయాలని కొద్ది రోజుల క్రితం డబ్బులు చెల్లించాడు. వ్యాన్‌ను పూర్తి చేయకపోవడంతో దిలీప్ మీద కపిల్ ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై కపిల్ శర్మకు పోలీసులు సమన్లు జారీ చేశారు