Bollywood: కంగ‌నా పై ముంబై హైకోర్టు ఆగ్ర‌హం..

Bollywood: బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగ‌నార‌నౌత్ పై ముంబై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నెపోటిజం కార‌ణంగా మ‌ర‌ణించారు అని వార్తాలు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌టి కంగ‌నా సుశాంత్ వంటి కొత్త‌వారిని తొక్కేస్తున్నార‌ని నిత్యం క‌స్సుబుస్సులాడేది. అయితే ఈ క్ర‌మంలో Bollywoodబాలీవుడ్‌లో జావేద్ అఖ్త‌ర్ నాయ‌క‌త్వంలో ఓ మాఫియా ప‌నిచేస్తోంద‌ని.. వారి కార‌ణంగానే ఇలా ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని కంగ‌నా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

kangana javed

దీంతో కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై జావేద్ అఖ్త‌ర్ స్పందించ‌గా.. తాను చేసిన వ్యాఖ్య‌లు త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం చాలా బాధ క‌లిగించిద‌ని ఆమె పై ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. దీంతో మార్చ్ 1న కోర్టుకు హాజ‌రు కావాల‌ని ముంబై హైకోర్టు కంగ‌నాకు స‌మ‌న్లు జారీ చేసింది. అయితే ఈ స‌మ‌న్ల‌పై కంగ‌నా స్పందిచ‌క‌పోవ‌డంతో కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. Bollywoodకంగ‌న‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్లు జారీ చేసింది.. తిరిగి ఈ కేసు మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది.