కల్కిలో ఆ పాత్రా చేయడానికి కారణం… మృణాల్ ఠాకూర్

నాగ్ అశ్విన్ దర్శకత్వం చేసిన కల్కి 2898 AD గురువారం నాడు థియేటర్లలో విడుదలై ఇప్పటికే సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ తారాగణంతో పాటు, ప్రముఖులు కూడా పలు పాత్రలు పోషించారు. కల్కి 2898 ADలో అతిధి పాత్రలో కనిపించిన అనేక మంది ప్రముఖులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె కల్కి 2898 AD (అశ్వని దత్, స్వప్నా దత్ మరియు ప్రియాంక దత్) నిర్మాతలతో కలిసి గతంలో సీతారామంలో పని చేసింది.

సైన్స్ ఫిక్షన్ చిత్రంలో తన పాత్ర గురించి ఎక్కువ వివరాలను పంచుకోకుండా మృణాల్ ఠాకూర్ ఒక ప్రకటనలో ఇలా అన్నారు. “కల్కి కోసం నన్ను సంప్రదించినప్పుడు, నేను అవును అని చెప్పడానికి క్షణం కూడా తీసుకోలేదు. నిర్మాతలు అశ్వనీ దత్‌పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.”