హీరో పూరి ఆకాశ్ విడుదల చేసిన Mr. Kalyan రిలీజ్ డేట్ పోస్టర్ !!!

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. 

మిస్టర్ కళ్యాణ్ విడుదల తేదీని నటుడు ఆకాశ్ పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ… మార్చి 10న విడుదల కాబోతున్న మిస్టర్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలి, అలాగే నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి గారికి దర్శకుడు పండు కు ఇతర నటీనటులకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది. 

నటీనటులు: 

మాన్యం కృష్ణ, అర్చన, రాజ్ వర, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు: 

డైరెక్టర్: పండు

నిర్మాత: సుబ్బారెడ్డి

సంగీతం: సుక్కు

సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి

ఎడిటర్: వినోద్ అద్వయ్

డాన్స్: అనీష్

ఫైట్స్: మల్లేష్

పీఆర్ఒ: శ్రీధర్