షాకింగ్ న్యూస్: పవన్-రాంచరణ్-శంకర్ కాంబోలో మూవీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా పవర్ స్టార్ రాంచరణ్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందా?.. అంటే అవుననే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్‌లో పవన్, రాంచరణ్ కలిసి సినిమా చేసే అవకాశముందట. ఇప్పటికే అంతా ఫైనల్ అయిందని, త్వరలోనే పవన్‌కి శంకర్ స్క్రీఫ్ట్ చెప్పనున్నారట.

PAWAN, RAMCHARAN AND SHANKAR

పవన్ ఒకే చెబితే ఈ ప్రాజెక్టు వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇందులో రాంచరణ్ ప్రధాన పాత్రలో నటిస్తాడని, పవన్‌ది ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక రాంచరణ్ RRRతో పాటు ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత శంకర్ డైరెక్షన్‌లో చరణ్ సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది.