బాలీవుడ్ నూతన వధూవరుల అత్యంత ఖరీదైన వివాహ బహుమతులు

బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ఇటీవల రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటకు బాలీవుడ్ పెద్దల నుండి ఖరీదైన వివాహ బహుమతులు అందాయని ఇంటర్నెట్‌లో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఈ బహుమతులు చిట్టా మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయి అని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ బహుమతుల ఏంటో మీరే చూడండి

నటుడు సల్మాన్ ఖాన్ 3 కోట్లు విలువైన రేంజ్ రోవర్‌ కార్ ను విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ కు బహుమతిగా ఇచ్చాడు

నటుడు రణబీర్ తన మాజీ ప్రియురాలికి 2.7 కోట్లు విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చాడు.

నటి అలియా నూతన దంపతులకు లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్‌ను బహుమతిగా ఇచ్చింది,

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వారి వివాహ వేడుకలో ఈ జంటకు ఒక ఖరీదైన పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు, దాని విలువ 1.5 లక్షలు.

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ విక్కీకి బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ అనే ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చాడు.

తాప్సీ విక్కీకి 1.4 లక్షలు విలువైన ప్లాటినం బ్రాస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చింది.

ఇక వరుడు విక్కీ కౌశల్ తన లేడీ లవ్‌కి 1.3 కోట్లు విలువైన డైమండ్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు.

కత్రినా తన భర్తకు ముంబైలోని 15 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చింది.