‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

అక్కినేని అఖిల్ హీరోగా రానున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది జూన్ 19న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇందులో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటించగా.. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

MEB ON JUNE 19

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అఖిల్ హీరోగా ఇంకా సక్సెస్ అందుకోలేదు. అతడు నటించిన గత మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా హీరోగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.