ఫస్ట్ లుక్ దాచాడు కానీ సినిమా మొత్తం అమ్మేశాడు…

తల అజిత్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ సినీ అభిమానులు బాక్సాఫీస్ దెగ్గర కాసుల వర్షం కురిపించడానికి సిద్దమవుతారు. లేట్ గా సినిమాలు చేసిన పెద్ద హిట్స్ ఇచ్చే అజిత్, మరోసారి వాలిమై సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. కనీసం ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయని ఈ మూవీ ఇటివలే బుక్ మై షోలో కెజీయఫ్ 2ని వెనక్కి నెట్టి కొత్త రికార్డు క్రియేట్ చేయగా, తాజాగా వాలిమై సినిమా భారి స్థాయిలో బుసినెస్ చేసిందనే బజ్ వినిపిస్తోంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్న మేకర్స్ ఇప్పటివరకూ వాలిమై నుంచి ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.

ఫస్ట్ లుక్ కూడా దాచి పెట్టిన ఈ మూవీ టోటల్ బిజినెస్ ని ప్రొడ్యూసర్ బోని కపూర్ క్లోజ్ చేసాడట. ఆల్ ఏరియస్ లోని థియేట్రికల్ హక్కులని, డిజిటల్ డీల్స్ ని, శాటిలైట్ హక్కులను కూడా బోని కపూర్ అమ్మేశారట. ఈ మొత్తం దాదాపు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని, బోనీ కపూర్ ఈ చిత్రంతో భారీగా వెనకేసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అఫీషియల్ గా ఒక్క అప్డేట్ లేని ఒక ప్రాజెక్ట్ అంత బుజినెస్ చేసింది అంటే అది కేవలం అజిత్ స్టామినా మాత్రమే. ఇంత ప్రిబిజినెస్ చేసిన ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.