Manchu Vishnu: మోస‌గాళ్లు.. ఇత‌ర భాష‌ల్లో అను అండ్ అర్జున్‌గా కాజ‌ల్, విష్ణు హ‌ల్‌చ‌ల్!

Manchu Vishnu: మంచు విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం మోస‌గాళ్లు.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్రం కోసం ప్ర‌చారం ఊపందుకుంది.. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది.. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా.. ఇంకా అధికారికంగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించలేదు. త్వ‌ర‌లోనే ఈManchu Vishnu సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది అని ప్ర‌క‌టించారు.

ఈ చిత్రం అమెరికాలో జ‌రిగిన బిగ్గెస్ట్ ఐడీ స్కామ్ క‌థాంశంతో తెర‌కెక్కుతుండ‌గా.. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో మోస‌గాళ్లు టైటిల్‌తో రిలీజ్ అవుతుండ‌గా.. ఇత‌ర భాష‌ల్లో అను అండ్ అర్జున్ అనే టైటిల్‌తో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కానీ మ‌ల‌యాళంలో మాత్రం అర్జున్ అండ్ అను అని పెట్టారు. ఇక ఇందులో Manchu Vishnuమంచు విష్ణుకు సోద‌రిగా బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ పోషిస్తుండ‌డం విశేషం. అలాగే ఈ సినిమాలో పోలీసాధికారిగా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి న‌టిస్తుండ‌గా.. న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్‌, వైవా హ‌ర్ష త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి జెఫ్రీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా.. Manchu Vishnuమంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.