అఖిల్‌ని కాదని అభిజిత్‌కు మోనాల్ సపోర్ట్

బిగ్‌బాస్-4లో ఇవాళ కూడా నామినేషన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. తాజాగా విడుదలైన నామినేషన్లకు సంబంధించిన ప్రొమో ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ టోపీలను టేబుల్‌ మీద పెడతారు. బెల్ మోగగానే కంటెస్టెంట్స్ వెళ్లి ఆ టోపీలను ధరిస్తారు. అందులో రెడ్ కలర్ టోపీలు ధరించిన అఖిల్, అవినాష్, అరియానా, అభిజిత్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది.

బయట ఉన్నవారితో స్వాప్ చేసుకోవచ్చని బిగ్‌బాస్ ప్రకటిస్తాడు. ఈ సందర్భంగా మోనాల్, అఖిల్ మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నాకు ఓట్లు వేస్తున్నారు. నాకు ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంది’ అని మోనాల్‌కి అఖిల్ చెబుతాడు. దానికి ‘అఖిల్ నువ్వు నాకు చాలా చేశావ్.. థ్యాంక్యూ’ అని నమస్కారాలు పెడుతూ మోనాల్ చెబుతోంది. దీనికి ఈ సర్ క్యాస్టిక్‌లు వద్దు అంటూ అఖిల్ ఫైర్ అవుతాడు.

అయితే అభిజిత్ ప్లేస్‌లో మోనాల్ స్వాప్ అవుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అఖిల్‌ను కాదని అభిజిత్ ప్లేస్‌లో మోనాల్ స్వాప్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.