బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్‌కి బంపర్ ఆఫర్

బిగ్‌బాస్‌లో ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ నర్మదగా పేరు తెచ్చుకుంది గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్. అఖిల్‌తో లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్ అయింది. తన అందంతో కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ.. బిగ్‌బాస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు నాలుగైదు తెలుగు సినిమాల్లో మోనాల్ నటించినా.. ఎవరికీ పెద్దగా తెలియదు. బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా మోనాల్ పేరు అందరికీ తెలిసిపోయింది.

MONAL SRINIVAS MOVIE

బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ గుజరాతీ భామకు ఆఫర్లు మీద ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ మా టీవీలో ‘డాన్స్ +’ షోకు హోస్ట్‌గా మోనాల్‌ను తీసుకున్నారు. తాజాగా మోనాల్‌ ఒక సినిమాలో అవకాశం దక్కించుకుని బంపర్ ఆఫర్ కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఒక పాటలో మోనాల్ నటించనుంది.

దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ పెప్పీ సాంగ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి మోనాల్ డ్యాన్స్ వేయనుంది. ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ ఇందులో కీలక పాత్రలలో నటించనున్నారు.