మహేశ్‌తో మోనాల్ స్పెషల్ సాంగ్.. క్లారిటీ వచ్చేసింది

బిగ్‌బాస్ 4తో మంచి పేరు తెచ్చుకున్న మోనాల్.. బయటికి వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీబిజీగా ఉంది. ఇటీవల వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ కొట్టేసింది. పరశురామ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించనుందని వార్తలొస్తున్నాయి.

monal in sarkar vari pata

ఈ వార్తలపై మోనాల్ స్పందించింది. సర్కారువారి పాట సినిమాలతో తాను ఎలాంటి స్పెషల్ సాంగ్‌లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం స్టార్ మా టీవీలో వస్తున్న డ్యాన్స్ ప్లాస్ షోలో జడ్జిగా మోనాల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.