
జూన్ 1వ తేదీ నుండి కేరళ సినీ పరిశ్రమ సమ్మె చేయనుంది. దానివల్ల షూటింగులు, థియేటర్లో సినిమాలు ప్రదర్శన నిలిపివేయబడుతుంది. దీనికి గల ప్రధాన కారణం ప్రస్తుత సినిమా బడ్జెట్లో భారీగా పెరగడం. అంతేగాక నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా అత్యధిక పారితోషకం తీసుకోవడం వల్ల సినిమాకు బడ్జెట్ పెరుగుతూ పోతుంది. దానికి తోడు సినిమాల సక్సెస్ రేట్ అనేది తగ్గిపోవడంతో కేరళ చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడటం జరుగుతుంది. వీటన్నింటినీ పరిష్కరించుకునే విధంగా ఈ సమ్మె చేపట్టడం జరుగుతుంది. ఈ సమ్మెను ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించగా దీనిని సపోర్ట్ చేస్తూ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలకు సంబంధించి పారితోషకాలు తగ్గించి రాష్ట్ర వినోదపు విన్ను తగ్గు ముఖం పడితే తప్ప ఈ సమ్మెను వెనక్కు తీసుకోబోయేది లేదంటూ మాట్లాడుతున్నారు. ఈ పారితోషకాలు వల్ల, భారీ బడ్జెట్లో వల్ల ఇప్పటికీ నిర్మాతలకు ఎంతో భారం పెరిగింది. అయితే దీని ఎఫెక్ట్ ఇతర చిత్ర పరిశ్రమలకు కూడా పడనుంది. పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్న సమయంలో జూన్ నుండి మలయాళం లో విడుదల కానున్న సినిమాలు కాస్త తొందరగా పడినట్లే అర్థమవుతుంది. ఇకపై ఏం జరుగుతుందనేది వెళ్లి చూడాల్సిందే.