Molly wood: సూప‌ర్‌స్టార్‌తో క‌లిసి డ్యాన్స్‌ చేయ‌నున్న ఏ ఆర్ రెహ‌మాన్!

Molly wood: లెజండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. ఆయ‌న కంపోజ్ చేసిన సాంగ్స్ వింటే ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ఆ సాంగ్‌లో లీన‌మైపోవాల్సిందే. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌… ఎన్నో అవార్డులు గెలుచున్న మ్యూజిక్ మ్యాస్ట్రో. ఆయ‌న సంగీతంపై ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా ఫిదా అవుతారు.. కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌, మాలీవుడ్‌, టాలీవుడ్ ప‌లు భాష‌ల్లో సంగీతం అందించారు ఏ ఆర్ రెహ్మాన్‌. ఎన్నో హిట్ ఆల్బ‌మ్స్ ఇచ్చిన‌ ఏ ఆర్ రెహ్మాన్.. త్వ‌ర‌లో తెర‌పై ఆడిపాడ‌నున్నారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డమే కాకుండా తెర‌పై పంచుకోనున్నాడు.

mohanlal arrehman

Molly wood బి. ఉన్నికృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అరాట్టు అనే సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి రెహ‌మాన్‌ స్వ‌రాలు అందిస్తున్నారు. అలాగే ఇందులో మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఆయ‌న ఓ పాట‌లో డ్యాన్స్ చేయ‌నున్నాడు. ఇక ఈ పాట‌ను ఇటీవ‌లే చెన్నైలోని ఓ స్టూడియోలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని మోహ‌న్‌లాల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుపుతూ.. ‌మ్యూజిక్ మ్యాస్ట్రో రెహ్మాన్‌తో షూటింగ్‌లో పాల్గొన‌డం గొప్ప అనుభ‌వం అంటూ పోస్ట్ చేశాడు. సెట్లో వీరిద్ద‌రి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు మోహ‌న్‌లాల్‌. ‌