బిగ్‌బాస్: మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్‌బాస్ షో అన్ని భాషల్లో చాలా పాపులర్ అయింది. అన్ని భాషల్లో బిగ్ స్టార్స్ ఈ షోను హోస్ట్ చేస్తుండటంతో.. ఈ షోకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. హిందీలో సల్మాణ్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా.. తమిళంలో కమల్‌హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్నాడు. ఇక తెలుగులో గత రెండు సీజన్లను నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మలయాళంలో బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తవ్వగా.. మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది.

mohanlal remunaration for bigboss

ఈ షోకు హోస్ట్‌గా మోహన్ లాల్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ షోకు హోస్ట్ చేయడానికి మోహన్ లాల్ రూ.18 కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌కు రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న మోహన్ లాల్.. ఇప్పుడు ఏకంగా 50 శాతం ఎక్కవ డిమాండ్ చేస్తున్నాడట. అయితే బిగ్ బాస్ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ కారణంగా రెమ్యూనరేషన్ పెంచేందుకు బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.