ఫ్యాన్స్‌కు మోహన్‌లాల్ న్యూ ఇయర్ గిఫ్ట్

ఏదైనా పండుగ వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కి హీరోలు సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఉంటారు. ఇక హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కి హీరోలు సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్, ట్రైలర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కి మోహన్‌లాల్ కానుక ఇచ్చాడు.

MOHANLAL DRUSHYAM2
MOHANLAL DRUSHYAM2

మోహన్ లాల్, మీనా నటించిన దృశ్యం 2 సినిమా టీజర్ న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. జీతో జోసెఫ్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మీనా, సిద్ధిక్, ఆశా శరత్ మురళి గోపీ ప్రధాన పాత్రలలో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల భారీ కలెక్షన్లు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

ఆ సినిమాకు కొనసాగింపుగా దృశ్యం 2 సినిమా తెరకెక్కించారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దృశ్యం సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో రీమేక్ అయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.