Mohanbabu: త్వ‌ర‌లో డైలాగ్‌కింగ్ “స‌న్ ఆఫ్ ఇండియా” ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌..

Mohanbabu: టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు స‌న్ ఆఫ్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో 24 ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌, శ్రీ ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్‌డేట్ వ‌చ్చింది.

ఈ సినిమా Mohanbabuఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ నెల 29న రిలీజ్ చేస్తునున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించారు. అయితే రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగానే ఈ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ చేయాలి కాని.. కొన్ని అనివార్య కార‌ణాలు వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ప్ర‌క‌ట‌న‌ను ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఈ సినిమాలో Mohanbabu మోహ‌న్‌బాబును ఎన్న‌డూ చూడ‌ని విధంగా చూపించ‌నున్నామ‌ని చిత్ర‌బృందం పేర్కొన్నారు.