Mohanbabu: మాల్దీవుల్లో భార్య‌తో డైలాగ్‌కింగ్‌.. మంచు వారి స‌ర్‌ప్రైజ్‌కు అంతా షాక్‌!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ‌కు వెళ్లి వారంతా అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేసి అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇస్తున్నారు. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు హాట్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ, ఆ పిక్స్ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అలాగే ఇటీవ‌లే నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ యంగ్ క‌పుల్ వెకేష‌న్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు.

అక్క‌డ స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది స‌‌మంత. దీంతో మాల్దీవులు అనేది రెగ్యుల‌ర్ హాలిడే స్పాట్‌గా సినీ ప్ర‌ముఖులకు మారింది. ఇక తాజాగా Mohanbabu టాలీవుడ్ డైలాగ్‌కింగ్‌ మోహ‌న్‌బాబు త‌న భార్య‌తో మాల్దీవుల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. సాధార‌ణంగా మోహ‌న్‌బాబు ఖాళీ స‌మ‌యం దొరికితే తిరుప‌తికి వెళ్లి అక్క‌డే సేద‌తీరుతూ.. విలువైన స‌మ‌యాన్ని గడుపుతాడు. కానీ ఈ సారి ఆయ‌న సేద‌తీర‌డానికి త‌న భార్య‌తో క‌లిసి మాల్దీవుల్లో వెళ్ల‌డాన్ని అంతా ఆశ్చ‌ర్యపోతున్నారు. వీరితో పాటు కూతురు ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, అల్లుడు శ్రీ‌నివాస‌న్ మ‌న‌వ‌రాలు విద్య నిర్వాణ కూడా ఉన్నార‌ట‌. అయితే Mohanbabu మోహ‌న్‌బాబు ఆయ‌న భార్య నిర్మ‌ల‌తో ఇసుక తిన్నెల‌పై కూర్చొని సూర్యాస్త‌మ‌యం వేళ‌లో సేద‌తీరుతున్నారు. ఈ క్ర‌మంలో మంచు లక్ష్మీ ప్ర‌స‌న్న త‌న త‌ల్లితండ్రుల ఫోటో క్లిక్‌మ‌నిపించింది. ఇందులో మోహ‌న్‌బాబు టీష‌ర్ట్ వేసుకోని ఉండ‌గా.. భార్య నిర్మ‌ల పంజాబీ డ్రెస్ ధ‌రించి భ‌ర్త భుజాల‌పై వాలింది.. ఇద్ద‌రూ స్మైల్ ఇస్తున్న ఫోటోను లక్ష్మీ ప్ర‌స‌న్న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది.