Mohanbabu: వ్యాక్సిన్ వేయించుకున్న డైలాగ్ కింగ్‌..

Mohanbabu: క‌రోనా వైర‌స్ దేశంలో మ‌ళ్లీ విజృంభిస్తుంది.. ఈ నేప‌థ్యంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. దీంతో సామాన్యుల నుంచి సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు.. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

Corona vaccine

ప్ర‌ధాని మోదీ నుంచి క‌మ‌ల్‌హాస‌న్‌, నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ వంటి ప్ర‌ముఖులు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా ప్ర‌ముఖ టాలీవుడ్ డైలాగ్ కింగ్ మంచు మోహ‌న్ బాబు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని నేను కోరుతున్నాను అంటూ జై హింద్ తెలిపాడు మోహ‌న్‌బాబు.‌