మోహన్ బాబు పాత్ర హైలెట్.. నిజ జీవిత పాత్రలో కుమ్మేశాడు

సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇవాళ విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ఫ్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సుధ కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సూర్య దీనిని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ దీనిని సంగీతం అందించారు.

mohanbabu

సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు పాత్ర ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో వింగ్ కమాండర్ పాత్రలో మోహన్ బాబు నటించాడు.

ఇందులో మోహన్ బాబు పాత్ర పేరు భక్తవత్సలం నాయుడు నాయుడు. మోహన్ బాబు అసలు పేరునే ఇందులో ఆయన పాత్రకు పెట్టారు. ఈ పాత్రలో క్రమశిక్షణ, ధైర్యం, విలువలను పాటించే వ్యక్తిగా మోహన్‌బాబు నటించాడు. ఒక కఠినమైన అధికారిగా మోహన్ బాబు ఉంటాడు. ఈ పాత్ర మోహన్ బాబు నిజజీవిత పాత్రను పోలి ఉంటుంది. నిజజీవితంలో కూడా మోహన్ బాబు క్రమశిక్షణ, విలువలను పాటిస్తాడనే విషయం తలిసిందే