గ‌ద్యాన్ని పాట‌గా మ‌ల‌చాలంటున్న‌ డైలాగ్‌కింగ్.. ట్యూన్ క‌ష్ట‌మ‌న్న ఇళ‌య‌రాజా!

డైలాగ్ కింగ్‌, క‌లెక్ష‌న్ కింగ్ వంటి పేర్ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు మంచు మోహ‌న్ బాబు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్, 24ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని 11వ శ‌తాబ్దం నాటి గ‌ర్జ‌న‌ను ఇళ‌య‌రాజాకు వినిపించారు. వెంట‌నే ఇళ‌య‌రాజా స్పందిస్తూ..

son of india

ఇంత క‌ఠిన‌త‌రంగా ఉంది .. మీరు వినిపించింది పూర్తిగా గ‌ద్యం. మీరు పాట‌లా పాడుతారా? దీనికి ట్యూన్ చేయ‌డం చాలా క‌ష్టం అంటూ తెలిపారు ఇళ‌య‌రాజా. దీనికి మోహ‌న్‌బాబు స్పందిస్తూ.. మీరే చేయ‌గ‌ల‌రు. మీకు సాధ్యం కానిదేది లేదు అని మోహన్‌బాబు అన్నారు. వీళ్ల‌తో పాటు ఈ చిత్ర డైరెక్ట‌ర్ ర‌త్న‌బాబు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశాడు మంచు విష్ణు. ట్విట్ట‌ర్‌లో విష్ణు తెలుపుతూ.. దిగ్గ‌జాల‌తో సినిమా నిర్మించ‌డం ఆ భ‌గ‌వంతుడు ఇచ్చిన అవ‌కాశం నాకు. ఒక గ‌ద్యాన్ని పాట‌గా మ‌ల‌చ‌డం కేవ‌లం లెజెండ్స్‌కు మాత్ర‌మే సాధ్యం అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అలాగే మంచు విష్ణు మోస‌గాళ్లు చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో విష్ణుకు సోద‌రిగా బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.