ఎందుకంటే, మొదటి ఆరు వారాలు వరకు కంటిన్యూ గా నామినేట్ అవుతూ మరియు సక్సెస్ఫుల్ గా సేవ్ అవుతూ అందరిని షాక్ కి గురి చేసింది. మొదట్లో మిత్రాకు ఆడడం రాదు అంటూ ప్రతి ఒక్క వారియార్స్ సభ్యులు నామినేట్ చేసినా తను ధైర్యంగా పోరాడి నిలబడింది. తర్వాత బయట కూడా పి ఆర్. టీమ్ ఉంది అని నెగటివ్ ప్రచారం ఎంత మంది చేసినా ఆడియన్స్ తనకు ఓట్స్ వేస్తూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ షాకింగ్ ఏమంటే తనని టార్గెట్ చేసిన ఒక్కోక్కరు తన కళ్ళ ముందే బయటకు వెళ్ళడం చూసిన మిత్రా ఇంకా ధైర్యంగా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తనకి ఆడడం రాదు అన్న ఇంటి సభ్యులే తనని ఏడు వారాలు లో రెండు వారాలు బెస్ట్ ప్లేయర్ గా ముందు నిలబెట్టారు. అంటే తన గేమ్ ఆ రేంజ్ లో డెవలప్ చేస్కుందో మనకి అర్ధమౌతుంది.. తన గేమ్ తాను అడుతు కూడా అందరికి రోజూ 3 సార్లు ఓపికతో వంట చేసి ఫుడ్ పెడుతుంది. సో, 7వ వారం కూడా విజయవంతంగా సేవ్ అయ్యి తన అడుగులు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీ వైపు సాగాలని కోరుకుందాం.