Tollywood: “మిస్టర్ అండ్ మిస్‌” ఒక బ్యూటీఫుల్ మూవీ: హీరోయిన్ జ్ఞానేశ్వ‌రీ

Tollywood: అశోక్ రెడ్డి దర్శకత్వంలోతెర‌కెక్కుతున్న‌ క్రౌడ్ ఫండెడ్ చిత్రం మిస్టర్ & మిస్ . ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల్‌గా శైలేష్ సన్ని, జ్ఞానేశ్వరి కండ్రేగుల న‌టిస్తుండ‌గా ఈ చిత్రం ఈనెల 29 న విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల మీడియాతో మాట్లాడుతూ.. “మిస్టర్ అండ్ మిస్” కూడా ఒక బ్యూటిఫుల్ ఫిలిం. నేను”లవ్ జంట” షార్ట్ ఫిలిం చేస్తున్న క్రమంలో అశోక్ గారు కలసి నాకు “మిస్టర్ అండ్ మిస్” డెమో ఫిలిం గురించి చెప్పారు. Tollywood ఆ తర్వాత అనుకోకుండా టెలివిజన్ షో పెళ్లిచూపులకు కూడా వెళ్లడం జరిగింది. అయితే మేము అశోక్ గారి తో చేసిన డెమో మిస్టర్ అండ్ మిస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీనికి 3 ఫిలిం ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా నాకు రావడం.. అలాగే సైమా అవార్డ్స్ లో మా డెమో ఫిల్మ్ కు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ వచ్చాయి. అశోక్ గారు దీన్ని ఫీచర్ ఫిల్మ్ గా చేద్దామని చెబితే చేద్దామని స్టోరీ చెబితే ఇందులో రొమాన్స్ ఎక్కువ ఉందని నో చెప్పాను. నేను నో చెప్పానని ముంబై నుంచి వేరే అమ్మాయితో షూట్ స్టార్ట్ చేశారు. Tollywood అయితే నేను నెల వరకు బాగా ఆలోచించి ఈ అవకాశం మిస్ చేసుకుంటున్నానేమో అని కాల్ చేసి ఓకే చెబితే వెంటనే తీసుకున్న అమ్మాయిని క్యాన్సల్ చేసి నన్ను హీరోయిన్ తీసుకున్నారు. ఈ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉందనుకొన్న టైంలో క్రౌడ్ సపోర్టుతో 80 నుంచి 100 మంది వరకు మాకు సపోర్ట్ చెయ్యడానికి ముందుకు రావడంతో దీన్ని క్రౌడ్ ఫండెడ్ మూవీగా చేయడం జరిగింది. సపోర్ట్ చేసిన వారికి నా ధన్యవాదాలు. Tollywood చాలామంది క్రౌడ్ ఫండెడ్ మూవీ అంటే ఆర్ట్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది అందరికీ నచ్చే బ్యూటిఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీ. ఇందులో నేను శశి అనే క్యారెక్టర్ చేశాను. ముంబై కంపెనీలో హెచ్ఆర్ గా చేసే నేను హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ రావడం, ఇక్కడ అమలాపురం నుండి ఇంగ్లీష్ కూడా అలానే అబ్బాయి ని కలవడం, క్లాస్ కల్చర్ నుండి వచ్చిన నేను, విలేజ్ కల్చర్ నుండి వచ్చిన అబ్బాయికి ఇంగ్లీష్ కూడా నేర్పి, Tollywood ఆ అబ్బాయితో నా జర్నీ ఎలా స్టార్ట్ చేస్తూ తనతో లివింగ్ రిలేషన్ లో ఉండడం జరుగుతుంది. అయితే వారిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరికీ సెట్ అవ్వక బ్రేకప్ అయ్యే టైంలో వారి ఫోన్ మిస్ అవ్వడం, ఆ ఫోన్లో వారి ప్రైవసీ కి సంబంధించిన వీడియోస్ ఉండడం, Tollywood అయితే పోయిన ఫోన్ దొరికిందా లేదా, ఫోన్ ఎలా పోయింది, ఒకవేళ హీరోనే ఫోన్ తీశాడా , ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా.. అనేది ఈ సినిమా కథ.. మేము చేసిన డెమో లో ఓన్లీ టూ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇందులో రెండు క్యారెక్టర్స్ ఎలా కలిశారు వారి ప్రయాణం ఎలా సాగింది అనేది తెలియజేస్తూ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ ని టచ్ చేస్తూ ఈ మూవీ అద్భుతంగా తీశారు. Tollywood ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్, మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్, టెక్నీషియన్స్ టీమ్ అందరూ కూడా ఈ సినిమాకు ద బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీకు నా కో ఆర్టిస్ట్ సన్నీ కూడా 40 షార్ట్ ఫిలిం చేసిన ఆయన దగ్గర నేను యాక్టింగ్ మేలుకవలు నేర్చుకున్నాను. Tollywood అశోక్ గారు “ఓ స్త్రీ రేపు రా” మూవీ ని ఎంత మొండిగా తీసి రిలీజ్ చేశారో , అంతే మొండిగా ఈ మూవీ ని తీసి రిలీజ్ చేస్తున్నారు. అశోక్ గారు వర్క్ చూసి తను ఏంతో నేర్చుకున్నాను. మా ఫ్యామిలీ లో ఎవరికీ సినిమా బ్యాక్ డ్రాప్ లేదు అలాంటిది నేను హీరోయిన్ అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు నా ఫ్యామిలీ మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత నాకు కన్నడలో తెలుగులో, ఓ.టి టి లో ఆఫర్స్ వచ్చాయి అవి త్వరలో తెలియ జేస్తాను. Tollywood ఈ మూవీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. ఆ చిత్రం చూసిన ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని జ్ఞానేశ్వ‌రీ తెలిపింది.