శ్రీమతి దుర్గావతి సమర్పణలో యస్.కె.యం.యల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై విక్కీ, నూరజ్, కీయా, లోహిత నటీనటులుగా ముక్కి హరీష్ కుమార్ దర్శకత్వంలో కండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న చిత్రం “మిస్టర్ లోన్లీ” వీడి చుట్టూ అమ్మాయిలే అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు అనంతరం
చిత్ర దర్శకుడు ముక్కి హరీష్ కుమార్ మాట్లాడుతూ .. ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు.ఆ తరువాత ఆ అబ్బాయి లైఫ్ ఏమైంది అనేదే చిత్ర కథాంశం. నిర్మాతకు నేను ఈ కథ చెప్పిన వెంటనే నన్ను నమ్మి ఈ మూవీ చేయడానికి ముందుకు వచ్చారు వారికి నా ధన్యవాదాలు. సంగీత దర్శకుడు నిజాని అంజాన్ అద్భుతమైన పాటలు అందించాడు. డి.ఓ.పి, ఎడిటర్ ఇలా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు
చిత్ర నిర్మాత కండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. నిర్మాతగా నాకిది 5 వ సినిమా అలాగే నేను 94 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గాచేయడం జరిగింది. ఈ “మిస్టర్ లోన్లీ” సినిమా మూడు స్టేజస్ లలో జరిగే లవ్ స్టొరీ. స్కూల్ ఏజ్ , కాలేజ్ ఏజ్, కాలేజ్ తరువాత ఇలా మూడు ఏజెస్ లలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇలా మూడు స్టేజ్ లలోను అబ్బాయిలు ప్రేమలో మోపపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు సాధారణంగా అమ్మాయిల ప్రేమలో మోసపోయిన అబ్బాయిలనే చూశాం, కానీ అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలను మాత్రం చాలా తక్కువ మందిని చూశాం. లవ్ లో ఫెయిల్ అయి తాగుడుకు బానిసైన అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు. కానీ.. లవ్ ఫెయిల్ అయి తాగుడుకు బానిసైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. అబ్బాయిల తల్లి,తండ్రులు 23 సంవత్సరాలు ఏంతో కష్టపడి చదివిస్తే ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ అమ్మాయి తన ప్రేమను రిజెక్ట్ చేసిందని సూసైడ్ చేసుకొంటున్నారు. ఇలా ప్రపంచంలో అమ్మాయిల వలన రోజుకొక అబ్బాయి సూసైడ్ చేసుకొంటున్నాడు. తరువాత పెంచిన వారి తల్లి తండ్రుల పరిస్థితి ఏంటి ? అనేది అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఆలోచించడంలేదు. అందరూ ఆడవారికి చాలా సహనం ఉంటుందని అంటారు. కానీ నా దృష్టి లో చాలా సహనం ఉండేది మగ వారికే .పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఆడవాళ్ళ చేతిలో బరిస్తున్నాడు. కరోనా నివారణకు కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వచ్చిందో ఇప్పుడు మేము లవ్ వ్యాక్సిన్ ను కనిపెట్టాము. అదే మిస్టర్ లోన్లీ . సినీ ప్రేక్షకులందరూ అర్జున్ రెడ్డి,ఆర్ ఎక్స్ 100 ను ఎలా తలుచుకున్నారో ఈ సినిమా విడుదల తరువాత యూత్ అంతా మా సినిమా “మిస్టర్ లోన్లీ” ని కూడా అలాగే తప్పకుండా తలచుకుంటారు.నాలుగు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ కథను తయారు చేసుకుని ప్రేమగా రాసి మీ ముందుకు తెస్తున్నాము. అతి త్వరలో మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా నని అన్నారు.
హీరో విక్కీ మాట్లాడుతూ …ఇది నా మొదటి చిత్రం .యూత్ అందరికీ ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
హీరోయిన్ కీయా మాట్లాడుతూ. ..షూటింగ్ లో చిత్ర టీం అందరూ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సినిమా లో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అని ఆన్నారు
ఎడిటర్ సాయిరాం మాట్లాడుతూ ..ఈ సినిమా చాలా బాగా వచ్చింది.యూత్ అందరికీ ఈ సినినా కనెక్ట్ అవుతుందని అన్నారు.
డి.ఓ.పి.ఆనంద్ గార మాట్లాడుతూ.. మూడు ఏజ్ లలో జరిగే మంచి కథ ఇది. 64 బ్యూటీఫుల్ లొకేషన్స్ లలో 34 రోజుల్లో ఈ సినిమాను తీయడం జరిగింది. చిన్న వారినుండి పెద్ద వాళ్ళ వరకు అందరికీ నచ్చే మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులందరూ చూసి మా సినిమాను ఆదరించాలని అన్నారు.
తారాగణం :
విక్కీ, కార్తిక్, కీయా తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమా పేరు: “మిస్టర్ లోన్లీ”
దర్శకుడు: ముక్కి హరీష్ కుమార్
నిర్మాత : కండ్రేగుల ఆదినారాయణ
ఎడిటర్: సాయిరాం
డి.ఓ.పి: ఆనంద్ గార
సంగీతం: నిజాని అంజాన్
పి.ఆర్.ఓ :- మేఘ శ్యామ్ – లక్ష్మి నివాస్