‘మిస్టర్ బచ్చన్’ కాశ్మీర్ వ్యాలీలో మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ “మిస్టర్ బచ్చన్” ప్రస్తుతం బ్యూటీఫుల్ కాశ్మీవ్యాలీలో టీం సాంగ్ షూట్‌ జరుపుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుని ముగింపు దశకు చేరుకుంది.

తాజా షెడ్యూల్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ పై  బ్యూటీఫుల్ మెలోడీ డ్యూయెట్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లోకేషన్ లో ఈ పాట చిత్రీకరణ గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈరోజు ఈ సాంగ్ షూట్ చివరి రోజు. లొకేషన్ సెలెక్షన్, సాంగ్ జానర్ సినిమాలో విజువల్ ఫీస్ట్, ఎమోషనల్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తోంది.

90% చిత్రీకరణ పూర్తి కావడంతో, మిగిలిన పార్ట్స్ ని చిత్రీకరించే దిశగా టీమ్ శరవేగంగా పని చేస్తోంది. రవితేజ, హరీష్ శంకర్, అద్భుతమైన ప్రొడక్షన్ టీం సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న “మిస్టర్ బచ్చన్” కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు