

ఎమెర్జింగ్ నిర్మాణ సంస్థ శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’. శైలేష్ రమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ నాగవంశీ బావమరిది రుష్య హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.
తాజాగా జైలర్, నాసామి రంగ చిత్రాల ఫేమ్ మిర్నా మీనన్‌ను ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇందులో ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో నటిస్తుండగా.. లెక్చరర్ సుమతి పాత్రలో మిర్నా మీనన్ నటిస్తున్నారు. ఇంకా మౌనిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు ఈ ఎంటర్‌టైనింగ్ రైడ్‌లో ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
‘డాన్ బాస్కో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. ‘వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్ – బ్యాచ్ 2014’…‘అన్ని రీయూనియన్‌లు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటానికే కాదు..కొన్ని విమోచన గురించి కూడా’ అని ఉంది. ఈ క్యాప్షన్ సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. శంకర్ గౌరి ఈ చిత్రానికి రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు – రుష్య, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, విష్ణు ఓయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు
సాంకేతిక వర్గం –
నిర్మాత – శైలేష్ రమ
బ్యానర్ – శ్రీ మాయ ఎంటర్‌టైన్మెంట్స్,
దర్శకత్వం – పి.శంకర్ గౌరి
మ్యూజిక్ – మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫీ – ఎదురోలు రాజు
ఆర్ట్ – ప్రణయ్ నైనా
ఎడిటర్ – గ్యారీ బి.హెచ్
పి.ఆర్.ఒ – వంశీ కాకా