కల్కి సినిమా పై మంత్రి నారా లోకేష్ ట్వీట్

ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రభాస్ కల్కి 2898AD సినిమా పై స్పందించారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా ఈరోజు విడుదల కావడంతో అన్ని ప్రాంతాల నుండి మంచి స్పందన వస్తుంది. సినిమాకు సంబంధించి అన్ని రివ్యూలు బావున్నాయి. అది తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఆ సినిమా గురించి తన సోషల్ మీడియా మాధ్యమం అయినా X ద్వారా ట్వీట్ చేసారు. సినిమా పై వస్తున్న స్పందన హిస్తుంటే తనకి చాలా సంతోషంగా ఉండాలి ఆనయ తెలిపారు. అలాగే కల్కి సినిమాలో నటించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాస్సన్, దీపికా పాడుకొనే అలాగే చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ కు తన కృతజ్ఞతలు తెలిపారు. మన దేశ సినిమాలలో ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అంటూ దీనికి కారణం అశ్విని దత్, స్వప్న, ప్రియాంక గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ప్రపంచ స్థాయి సినిమా అని అన్నారు.