మహేశ్ బాబుకి అదిరిపోయే మాస్ సాంగ్ ఇచ్చిన దేవి

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. కంప్లీట్ మాస్ మహేశ్ బాబుని చూపించిన ఈ టీజర్, 100 గంటల పాటు ట్రెండింగ్ లో నిలిచి ఘట్టమనేని అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఫుల్ మీల్స్ లాంటి ఈ టీజర్ చూశాక మహేశ్ ఫ్యాన్స్ కొత్త జోష్ లోకి వచ్చారు.

ఈ జోష్ ని మరింత పెంచుతూ సరిలేరు నీకెవ్వరూ నుంచి ఫస్ట్ సింగల్ బయటకి వచ్చింది. మైండ్ block అంటూ వచ్చిన ఈ సాంగ్ కి దేవిశ్రీ అదిరిపోయే బీట్ ఇచ్చాడు. టీజర్ మహేశ్ ని మాస్ గా చూపిస్తే, ఈ సాంగ్ అదే మహేశ్ ని ఊరమాస్ గా చూపించింది. మధ్యలో అక్కడక్కడా మహేశ్ బాబు వాయిస్ కూడా రావడంతో ఈ సాంగ్ ని ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో వింటారు. వచ్చే మండే వరకూ సరిలేరు నీకెవ్వరూ నుంచి మరో అప్డేట్ బయటకి రాదు కాబట్టి సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవడం ఖాయం.