అమ్మకానికి మైఖేల్ జాక్సన్ ఎస్టేట్

దివంగ‌త పాప్ స్టార్ మైఖేల్ జాక్స‌న్‌ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. తన డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. ఇప్పుడు ఆయన లేకపోయినా.. ఆయన స్టెప్పులు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుంటాయి. తాజాగా మైఖేల్ జాక్సన్ నెవర్ ల్యాండ్ ఎస్టేట్‌ను అమ్మకానికి పెట్టారు. కాలిఫోర్నియాలో ఉన్న ఈ ఎస్టేట్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రోన్ బుర్కిలీ రూ.2.2 కోట్ల డాలర్ల తక్కవ ధరకు దక్కించుకున్నారు.

MICHAL JANSON

ఈ ఎస్టేట్ 2700 ఎకరాల్లో ఉంటుంది. మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత ఈ ఎస్టేట్‌ను సైకామోర్ వ్యాలీ రాంచ్‌గా పేరు మార్చారు. 1980లో 20 మిలియన్ల డాలర్లకు మైఖేల్ జాక్సన్ ఈ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. మైఖేల్ జాక్సన్ మరణాంతరం ఈ ఎస్టేట్‌ను 100 మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పుడు చాలా తక్కువ ధరకే అమ్ముడుపోయింది.

మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత ఈ ఎస్టేట్ పేరును సైకామోర్ వాలీ రాంచ్‌గా పేరు మార్చారు. మైఖేల్ జాక్సిన్ చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినది ఈ ఎస్టేట్‌లోని అని ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.