“మెయ్యళగన్” ఫస్ట్ లుక్ విడుదల

హీరో కార్తీ తన 27వ చిత్రం కోసం తన సోదరుడు, హీరో సూర్య కొలాబరేషన్ లో ’96’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘కార్తీ 27’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా ‘మెయ్యళగన్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్ కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపించింది. అరవింద్ స్వామి సైకిల్ తొక్కుతుంటే, కార్తీ వెనుక కూర్చుని చిన్నపిల్లాడిలా పోజు ఇవ్వడం ఆకట్టుకుంది. తెలుగు తమిళ ద్విభాష చిత్రంగా రూపొందుతన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ , ఇతర ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ’96’ చిత్రానికి సూపర్ మెలోడిక్ హిట్స్ అందించిన గోవింద్ వసంత ఈ సినిమా కోసం సి.ప్రేమ్ కుమార్‌తో కలిసి పనిచేస్తున్నారు.

ఈ చిత్రం కుంభకోణం, శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా తుదిదశకు చేరుకున్నాయి.

నిర్మాతలు – జ్యోతిక, సూర్య
సహ నిర్మాత – రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్
రచన, దర్శకత్వం – సి.ప్రేమ్‌కుమార్,
డీవోపీ – మహేంద్రన్ జయరాజు,
సంగీతం – గోవింద్ వసంత,
ఎడిటింగ్ – ఆర్.గోవిందరాజ్,
ప్రొడక్షన్ డిజైనర్ -రాజీవన్
కాస్ట్యూమ్ డిజైనర్ – శుభశ్రీ కార్తీక్ విజయ్
లిరిక్స్- కార్తీక్ నేత & ఉమాదేవి
పీఆర్వో – వంశీ-శేఖర్