Tollywood: మెహ్రీన్ పీర్జాదా కృష్ణ గాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.. విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎఫ్2 చిత్రంలో హనీగా మరింత గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఎఫ్2 సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3లో నటిస్తోంది. కాగా ఇటీవలే హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను పంచుకుంది.. కాబోయే శ్రీవారు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ జీవితకాలం అతనితో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందని మెహ్రీన్ తెలిపింది.
అలాగే మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని.. గతేడాది లాక్‌డౌన్‌లోనే మాకు పరిచయం ఏర్పడిందని.. లాక్డౌన్ కారణంగా మేమిద్దం కలవలేకపోయామని.. కానీ పరిచయమైన నాటి నుంచి మెస్సేజ్‌లు, కాల్స్ చేసుకునేవాళ్లం.. ఇద్దరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను పంచుకున్నాం.. మేమిద్దం మాట్లాడుకోవడం ప్రారంభించిన 6రోజులకే తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు.. నేను చాలా షాక్ గురయ్యాను.. అతను అంటే నాక్కూడా ఇష్టం కాబట్టి నేను కూడా ఓకే అన్నాను.. అలాగే మేమిద్దం కలిసే ఎంగేజ్మెంట్ వేడుకలకు సంబంధించి ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాం. ఎందుకంటే ఇది మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన వేడుక.. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు.. వింటర్ సీజన్లో వివాహం జరిగే అవకాశం ఉంది.. మాది పక్కా డెస్టినేషన్ వెడ్డింగ్.. నేను ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను అంటూ తెలిపింది మెహ్రీన్ పిర్జాదా.