Mehreen pirzada: మాజీ సీఎం మ‌న‌వ‌డితో మెహ్రీన్ పిర్జాదా త్వ‌ర‌లో పెళ్లి..

Mehreen pirzada: మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. హీరో నాని న‌టించిన కృష్ణగాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రం విజ‌యం సాధించింది.. దీంతో ఆమెకు తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ చిత్రాల్లో న‌టించింది. 2017లో ఫిల్లౌరీ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఇప్పుడు ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం తెలుగులో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఎఫ్‌-3లో వ‌రుణ్‌కు జోడీగా న‌టిస్తోంది Mehreen pirzada మెహ్రీన్‌. అయితే త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు పెళ్లి పీట‌లెక్క‌బోతుంది.

ఆ వరుడు ఎవ‌రు అంటే.. హ‌ర్యానాకు మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌నుMehreen pirzada ఆమె పెళ్లాడ‌నుంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి నిశ్చితార్థం నిశ్చ‌య‌మైంది. మార్చి 13న రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వీరిద్ద‌రు ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంది. ఇరు కుటుంబాల స‌భ్యులు, ఆత్మీయుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. నిశ్చితార్థం అనంత‌రం వివాహ తేదీని వెల్ల‌డించ‌నున్నారు. Mehreen pirzadaమెహ్రీన్, భ‌వ్య కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు‌.. దీంతో ఎఫ్‌-3 సినిమా త‌ర్వాత సినిమాలకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది.