మరో ఛాన్స్ కొట్టేసిన ‘మేఘా ఆకాశ్’

సత్యదేవ్ హీరోగా వస్తున్న నాగశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్‌గా కన్ఫామ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారిపోయింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మేఘా ఆకాశ్‌ను తీసుకున్నట్లు సమాచారం.

MEGHA AKASH

మేఘా ఆకాశ్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమట. లై , చల్ మోహన రంగ సినిమాలతో తెలుగువారికి పరిచయమైన మేఘా ఆకాశ్.. తన నటనతో ఎంతమోంది అభిమానులకు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.


కన్నడలో విజయం సాధించిన ‘లక్ మాక్ టైల్’ అనే సినిమాకు రీమేక్‌గా దీనిని తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల మరింత ఆలస్యమైంది. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు రాగా.. వీటిని ఆ సినిమా యూనిట్ కొట్టిపారేసింది. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.