Mega Akkineni: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ కింగ్‌.. చిరు వంట‌కం తిన్నాక చ‌ల్ల‌బ‌డ్డా: నాగార్జున

Mega Akkineni: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వీరిద్ద‌రు అన్న‌ద‌మ్ముల అనుబంధలా వ్య‌వ‌హ‌రిస్తారు అనే విష‌యం తెలిసిందే.. నాగ్ చాలా సంద‌ర్భాల్లో.. త‌న‌కు అన్న‌య్య‌తో స‌మానం అంటూ చిరంజీవిపై ఆయ‌న ప్రేమ‌ను చాటుకుంటారు. కాగా ఆయ‌న న‌టించిన తాజా చిత్రం వైల్డ్‌డాగ్ ఈ రోజు విడుద‌ల‌వుతుంది.. అయితే నిన్న‌టి వ‌ర‌కు ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌ల్లో హ‌డావుడిగా ఆయ‌న ఎంతో బిజీగా ఉన్నారు. ఆ త‌ర్వాత కొంత రిలాక్సేష‌న్ కోసం తాజాగా Mega Akkineni నాగ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లగా..

Tollywood Brothers

ఆయ‌న కోసం చిరు స్వ‌యంగా వంట చేశాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోను సోష‌ల్ మీడియాలో నాగ్ పోస్ట్ చేస్తూ.. నా చిత్ర రిలీజ్ హ‌డావుడిలో ఉన్నా నాకు చ‌ల్ల‌బ‌ర‌చ‌డానికి మెగాస్టార్ స్వయంగా వండిన ఒక రుచిక‌ర‌మైన విందు అని ట్వీట్ చేశారు. Mega Akkineni ఇది కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.‌