Megastar: మెగాస్టార్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్.. చిరు చినుకుగా ఉప్పెన‌లా మారింది: ఉప్పెన టీం

Megastar: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తుంది. ఇందులో న‌టించిన హీరోయిన్ కృతిశెట్టి, విల‌న్‌పాత్ర‌లో మ‌క్క‌ల్‌సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. పెద్ద స్టార్ సినిమాలాగా క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కుర్చారు. అదేవిధంగా బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు దేవీ. దీంతో ఈ సినిమా మ‌రోస్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ప్ర‌స్తుతం ఉప్పెన మూవీ టీం స‌క్సెస్ సంబ‌రాలను ఆస్వాధిస్తున్నారు.

కాగా తాజాగా ఈ మూవీటీంకు Megastarమెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేక‌మైన కానుక‌లు పంపిచ‌డంతో పాటు ప్రేమ‌తో మీ చిరంజీవి అంటూ ఓ లేఖ‌ను పంపించారు. ఈ విష‌యాన్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ అభిమానుల‌తో పంచుకున్నారు. డియ‌ర్ డీఎస్పీ ఎగ‌సిప‌డిన ఈ ఉప్పెన విజ‌యానికి నీ సంగీతం ఆయువు ప‌ట్టు. స్టార్ చిత్రాల‌కు ఎంత ప్యాష‌న్‌తో మ్యూజిక్ అందిస్తావో.. చిత్రం రంగంలోకి ప్ర‌వేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాష‌న్‌తో మ్యూజిక్ ఇస్తావు. నీలో ఉండే ఈ ఎన‌ర్జీ ఎప్ప‌టికీ ఇలాగే ఉండాల‌ని కోరుకుంటూ.. నిన్ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా. నువ్వు నిజంగా రాక్‌స్టార్ .. ప్రేమ‌తో మీ చిరంజీవి అంటూMegastar చిరంజీవి పంపిన లేఖ‌ను చ‌దివి వినిపించారు డీఎస్‌పీ. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు దేవీ. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ పై స్పందిస్తూ.. చిరు చినుకు నుంచి ఉప్పెన‌గా మారేంత వ‌ర‌కు, ఈ సినిమాకు వెన్నంటే నిలిచిన వాయువు మీరు. ఈ విజ‌యం వైపు ప్ర‌యాణం మాది అయినా, ఆ ప్ర‌యాణం వెనుక ధైర్యం మీరు అంటూ Megastarచిరంజీవిపై వారి అభిమానం చూపించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.