Uppena: మెగాస్టార్ ఉప్పెన మూవీ టీమ్‌కు పంపిన గిఫ్ట్ ధ‌ర ఎంతో తెలుసా..

Uppena: మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తొలి చిత్రం ఉప్పెన బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ చిత్రబృందానికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా ప‌లు భాష‌ల ఇండ‌స్ట్రీలో సైతం గుర్తింపు వ‌చ్చింది. ఇందులో న‌టించిన వైష్ణ‌వ్‌తేజ్, కృతిశెట్టి, మరీ ముఖ్యంగా ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇంకా Uppenaఈ చిత్రానికి ప్రేక్ష‌కుల సంద‌డి త‌గ్గ‌ట్లేదు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బుచ్చిబాబు సానాకు స్టార్ల భారీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇక ఈ చిత్రంపై మెగా ఫ్యామిలీ తో పాటు మ‌హేశ్‌బాబు, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ వంటి స్టార్ల్ అభినంద‌న‌లు తెలిపిన విష‌యం తెలిసిందే.

megastar

ఇక ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ Uppenaచిత్రం భారీ విజ‌యం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా.. ఉప్పెన చిత్ర‌బృందానికి ఖ‌రిదైన గిప్ట్స్ పంపించారు. ఈ మేర‌కు ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ‌ప్ర‌సాద్‌, ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ చిరుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అస‌లు చిరు ఇచ్చిన గిప్ట్స్ ధ‌ర వింటే షాకే.. ఆ బొమ్మ‌కు ఇంతా ఖ‌రీదా? అనుకుంటారు. ఏకంగా రూ. 83వేల విలువ చేసే ఓ ప్రేమికుల బొమ్మ. ఈ బొమ్మ పేరు ది థ్రిల్ ఆఫ్ ల‌వ్ క‌పుల్ ఫిగ‌రైన్‌. దీన్ని స్పానిష్ సంస్థ లాడ్రో రూపొందించింది. ఈ బొమ్మ‌లో ఇద్ద‌రు ప్రేమ‌జంట వారి ప్రేమను పంచుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ బొమ్మ‌ను చిరు Uppenaఉప్పెన చిత్రబృందానికి గిప్ట్‌గా త‌న సందేశంతో పంపించారు. ‌