Megastar: మ‌రోసారి మెగాస్టార్‌కు జోడీగా త్రిష‌..

Megastar: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా రియ‌ల్ హీరో సోనూసూద్ న‌టిస్తున్నాడు. అలాగే ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, పూజాహెగ్దే ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.

lucifer

ఇక ఈ సినిమా అనంత‌రం Megastarమెగాస్టార్ చిరంజీవి.. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్ర‌మైనా లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించ‌నున్నాడు. అయితే ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర కోసం న‌య‌న‌తార‌ను అడిగార‌ట‌.. కానీ ఏవేవో కార‌ణాలు చెప్పి ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ట‌. ఇక ఆ పాత్ర కోసం త్రిష‌ను అడిగార‌ట చిత్ర‌బృందం. దీంతో ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ని అంటున్నారు. వ‌చ్చే నెల నుంచే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుంది. కాగా Megastarమెగాస్టార్ చిరంజీవీ-త్రిష గ‌తంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్టాలిన్ చిత్రంలో న‌టించ‌గా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తికావ‌స్తున్నాయి.