Acharya: ఒకే ఒక్క స్టెప్పుతో ఆ సాంగ్‌పై విప‌రీత‌మైన క్రేజ్ తీసుకొచ్చిన మెగాస్టార్‌!

Acharya: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ Acharya చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి.. ఇక ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ సిద్ధ పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ని విష‌యం తెలిసిందే. సిద్ధ పాత్ర‌కు సంబంధించి ఇటీవ‌లే చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి, రాంచ‌ర‌ణ్ ఇద్దరూ న‌క్స‌లైట్ డ్రెస్‌లో ముందడుగు వేస్తూ క‌నిపించారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి..

acharya

ఇక ఈ సారి సాంగ్ అప్‌డేట్ వ‌చ్చింది.. ఈ Acharya చిత్రానికి మ‌రోసారి మెగాస్టార్ చిరంజీవికి మ్యూజిక్ అందిస్తున్నాడు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌.. దీంతో సంగీత ప్రియుల‌కు, ప్రేక్షకాభిమానుల‌కు ఎంతో ఆతృత‌గా ఉంది.. ఎప్పుడెపుడా ఈ చిత్రం సాంగ్స్ రిలీజ్ అవుతాయా అనే క్ర‌మంలో ఈ Acharya చిత్రంకు సంబంధించి లాహె లాహె ఫుల్‌ సాంగ్‌ను రేపు సాయంత్రం 4.05నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్‌. ఈ మేర‌కు మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ప్రొమోతో ప్ర‌క‌టించారు Acharya చిత్రబృందం.