Megastar: మ‌రో సినిమాను ఓకే చేసిన మెగాస్టార్‌!

Megastar: మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి తాజా చిత్రం ఆచార్య‌లో న‌టిస్తుండ‌గా.. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్ చేశారు. అలాగే ఈ సినిమా అనంత‌రం తాను చేయ‌బోయే సినిమాలు.. మ‌ళ‌యాలంలో ఘ‌న విజ‌యం సాధించిన లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్‌గా వ‌స్తున్న చిత్రంలో చిరు న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంతో పాటు తాలా అజిత్ న‌టించిన త‌మిళ చిత్రం వేదాళం రీమేక్ చిత్రంలో న‌టిస్తున్నాడు Megastar చిరంజీవి. ఈ చిత్రాన్ని మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేయ‌నున్నారు. ఇక తాజాగా మ‌రో సినిమాను ఒప్పుకున్నారు చిరంజీవి గారు.. బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో చిరంజీవి న‌టించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని Megastar చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ న‌లుగురు డైరెక్ట‌ర్లు (కెప్టెన్‌).. న‌లుగురు డైరెక్ట‌ర్లు ఫెంటాస్టిక్ ఫోర్‌.. చార్ క‌ద‌మ్‌.. అంటూ పోస్ట్ చేసి కొర‌టాల శివ‌, బాబీ, మోహ‌న్‌రాజా, మెహ‌ర్ ర‌మేశ్‌ల‌తో క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. కాగా.. మెగాస్టార్‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌ను సిద్ధం చేసిన బాబీతో చేయ‌డానికి Megastar చిరు సుముఖ‌త వ్య‌క్తం చేశారు.