

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమోపస్ ‘విశ్వంభర’ ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం కోసం డిజైన్ చేసిన మెస్మరైజ్ చేసే వరల్డ్ లోకి ఒక గ్లింప్స్ అందించింది. ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ – అకాడమీ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి స్వరపరిచిన రామ రామ ఏప్రిల్ 12న విడుదల కానుంది. సాంగ్ టైటిల్, పాట పోస్టర్ కూడా రామ రామ భక్తి గీతం అని సూచిస్తున్నాయి. ఈ పోస్టర్ లో చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషధారణలో ఉన్న పిల్లలు, బ్యాక్ డ్రాప్ లో రాముడి గొప్ప విగ్రహం ఉంది. సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట కోసం సాహిత్యం రాశారు.
తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, విశ్వంభర ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు, దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తారు.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో