మెగాస్టార్ కోసం ట్రై చేస్తున్న దిల్ రాజు.. సెట్టయితే త్వరలోనే గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఆచార్య షూటింగ్ ని రీ స్టార్ట్ చేయనున్న మెగాస్టార్ అలాగే వేదాలం రీమేక్, లూసిఫెర్ రీమేక్ లను కూడా స్టార్ట్ చేయనున్నారు. బాబీతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరో ఇప్పట్లో కొత్త సినిమాలను ఒప్పుకోలేనంత బిజీగా మారనున్నట్లు అర్ధమవుతోంది. 2022 వరకు కాల్షీట్స్ క్లోజ్ అయ్యాయనే చెప్పాలి.

ఇక అగ్ర నిర్మాత దిల్ రాజు చిరంజీవితో మరొక కొత్త ప్రాజెక్ట్ కోసం కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారని టాక్ వస్తోంది.
దిల్ రాజు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బోయపాటి శ్రీనుని లాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు కూడా సరైన స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాడు. సెట్టయితే మెగాస్టార్ నుండి వీలైనంత త్వరగా గ్రీన్ సిగ్నల్ అందుకోవాలని చూస్తున్నారు. బోయపాటి శ్రీను ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని టాక్. పూర్తి కథ ఫైనల్ గా ఫిక్స్ అయిన తరువాతనే అధికారిక ప్రకటన వస్తుందట. బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ రేపే స్టార్ట్ కానుంది. 2021 సమ్మర్ లో ఆ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.