ఇది మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం…

మూడున్నర దశాబ్దాల వెండితెర ఇలవేల్పు మెగాస్టార్, దశాబ్దం తర్వాత మళ్లీ తెరపై కనిపిస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. చిరు ఎంట్రీ మూవీగా వచ్చిన ఖైదీ నంబర్ 150, అప్పటి వరకూ ఉన్న నాన్ బాహుబలి రికార్డులని తిరగరాసి కొత్త చరిత్ర చరిత్ర లిఖించింది. యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ వంద కోట్ల షేర్ రాబట్టిన చిరంజీవి, సైరాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు. కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ భారీ బడ్జట్ సినిమా ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చే రేంజులో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. ఒక సీనియర్ హీరో సినిమాకి ఇంత సత్తా ఉందా, నిజంగానే ఇది చిరుకి మాత్రమే సాధ్యమయ్యే రికార్డ్ అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకుంటున్నాయి. ఏరియా వైస్ సైరా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి…

Nizam – 28 Cr+
Ceeded – 22 Cr
East – 10.40 Cr
West – 9.20 Cr
Guntur – 11.2 Cr
Nellore – 4.8 Cr
Karnataka – 26.25 Cr
Hindi – 25 Cr+
Total – 136.85 Cr
(మిగిలిన ఏరియాల్లో ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది)

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాలో కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ నుంచి టాప్ స్టార్స్ నటిస్తుండడం విశేషం. అమితాబ్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటించడంతో హిందీలో కూడా సైరాకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వాడుకోని రామ్ చరణ్ ప్రొమోషన్స్ ని మొదలుపెడితే అక్టోబర్ నాటికి సైరా ఓపెనింగ్స్ లో మాసివ్ నంబర్స్ చూసే అవకాశం ఉంది.