
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్రం ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని తెలియజేశారు. ఇది ఇలా ఉండగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఒక విషయాన్ని తెలియజేశారు. తన స్క్రిప్టును మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపించినట్లు, ఆ స్క్రిప్ట్ లో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు శంకర్ వరప్రసాద్ అని తెలియజేశారు. స్క్రిప్ట్ విన్న చిరంజీవి గారికి ఎంతో నచ్చిందని, లేట్ లేకుండా త్వరలో ముహూర్తం పెట్టి సినిమా మొదలుపెడదామని అన్నారని, వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
https://x.com/AnilRavipudi/status/1904833581337501926?t=E8XT3uJRBLfZesV9-xbWdw&s=19