Tollywood: మెగాస్టార్ న‌టించిన‌ రుద్ర‌వీణ నేటితో 33ఏళ్లు.. నాగ‌బాబు ట్వీట్‌!

Tollywood: మెగాస్ట‌ర్ చిరంజీవి న‌టించిన రుద్ర‌వీణ సినిమా 4 మార్చి 1988లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంతో నేటితో 33ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా నాగ‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశాడు. మెగా బ్ర‌ద‌ర్స్ త‌ల్లి అయినా అంజ‌నా దేవి పేరుతో అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగేంద్ర‌బాబు రుద్ర‌వీణ నిర్మించాడు. ఈ చిత్రం త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఉన్న‌న్ ముడియ‌మ్ తంబి చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా వ‌చ్చింది. త‌మిళ వెర్ష‌న్‌లో ప్ర‌ముఖ న‌టుడు క‌మల్ హాస‌న్ న‌టించారు.

Rudraveena Megastar

ఇక Tollywoodతెలుగు వెర్ష‌న్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. బాల‌చంద‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈTollywood సినిమా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి చిత్రంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు 33వ జాతీయ అవార్డుల్లో మూడు అవార్డులు ద‌క్కించుకుంది. బెస్ట్ ఫీచ‌ర్ మూవీ కేట‌గిరిలో న‌ర్గీస్‌ద‌త్ అవార్డు ద‌క్కించుకుంది. అలాగే ఈ సినిమాకు అందించిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాకు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డు ద‌క్కింది. ఈ సినిమాలో నేను సైతం పాటను ఆల‌పించిన దివంగ‌త ప్ర‌ముఖ సింగ‌ర్ బాల‌సుబ్ర‌హ్మాణ్యం కు ఉత్త‌మ గాయ‌కుడిగా నేష‌న‌ల్ అవార్డు ద‌క్కింది. సామాజిక అంశంతో తెర‌కెక్కిన ఈTollywood చిత్రంకు 4 నంది అవార్డులు కూడా వ‌రించాయి.