యంగ్ టైగర్ కి మెగాస్టార్ ఫోన్ కాల్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న తారక్ కి అభిమానులు, స్టార్ హీరోస్, ఇండస్ట్రీ వర్గాల నుంచి కోలుకోమని చాలా మెసేజస్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఎన్టీఆర్ కి కాల్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడట. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన చిరు… ఎన్టీఆర్ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారని, ఎన్టీఆర్ ఎనేర్జిటిక్ గా మాట్లాడడం తనకి సంతోషాన్ని కలిగించిందని చిరు ట్వీట్ చేశాడు.