మాటల మంత్రికుడితో మెగాస్టార్… అతి త్వరలో అనౌన్స్మెంట్

chiranjeevi trivikram movie

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా. ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. అయితే చిరంజీవి … తన 152వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి నటించనున్న 153వ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. హీరో అల.. వైకుంఠపురంలో.. చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అప్పటికి కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం దాదాపుగా పూర్తి కానుంది. అలాగే త్రివిక్రమ్‌కి కూడా అల.. వైకుంఠపురంలో.. చిత్రం విడుదలవుతోంది. దీంతో చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జై చిరంజీవి చిత్రం విడుదలైంది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.