Acharya Movie: మెగాస్టార్ ప‌క్క‌న రెజీనా కుమ్మేసింద‌ట‌!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో ఐటెం సాంగ్‌కోసం రెజీనా కాసాండ్రా ఆడిపాడ‌నుంద‌ని తెలిసిన విష‌య‌మే. ఈ సాంగ్‌లో రెజీనా మెగాస్టార్‌తో క‌లిసి డాన్స్ కుమ్మేసింద‌ట‌. ఈ ఐట‌మ్ సాంగ్‌ను ఒక రేంజ్‌లో ప్లాన్ చేశార‌ని స‌మాచారం. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో చిరంజీవి చేసిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో రాయ్ ల‌క్ష్మీతో ర‌త్తాలు ర‌త్తాలు అనే ఐటెం సాంగ్‌లో మాస్ ఆడియెన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

acharya item song

ఇక ఈ Acharya Movie చిత్రానికి మ్యూజిక్ అందించిన మ‌ణిశ‌ర్మ‌.. ఈ ఐటెం సాంగ్ కు ఇచ్చిన ట్యూన్ కుర్రాళ్ల‌ను ఒక ఊపు ఊపేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇదిలా ఉంచితే.. ఇందులో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. సిద్ధ పాత్ర‌ల్లో రామ్ చ‌ర‌ణ్‌, మ‌రో అతిథి పాత్ర‌ల్లో పూజా హెగ్దే న‌టిస్తున్నారు. ఈ Acharya Movie చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.