చిత్ర పరిశ్రమ దిగ్గజాల సమక్షంలో #Mega157 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎంటర్టైన్మెంట్ ని రీడిఫైన్ చేయడానికి స్టేజ్ సెట్ అయ్యింది. ఇండియన్ సినిమాలో లెజండరీ లెగసీకి పేరుగాంచిన చిరంజీవి, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ల నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు దాదాపు ప్రతి జానర్ లో అద్భుతమైన విజయాలు సాధించారు. దశాబ్దాల కెరీర్ లో ఎన్నో హిట్స్, లెక్కలేనన్ని అవార్డులు, తరాలను దాటిన అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు, మెగాస్టార్ అంచనాలను మరింత పెంచే ఎక్సయిటింగ్ ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నారు. సోషియో-ఫాంటసీ విశ్వంభర విడుదలకు రెడీ అవుతుండగా, మెగాస్టార్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడితో కలిసి ఒక ఎక్సయిటింగ్ న్యూ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు. 8 చిత్రాలకు 8 బ్లాక్ బస్టర్లతో అద్భుతమైన విజయ పరంపరను కొనసాగించిన అనిల్ రావిపూడి..లేటెస్ట్ రిలీజ్ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, రికార్డులను బద్దలు కొట్టి, 300 కోట్ల గ్రాస్‌ను దాటింది. మోస్ట్ ఎవైటెడ్ #Mega157ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

Mega157 ప్రాజెక్ట్‌ను ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. ఇది చిత్రానికి గొప్ప ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ క్లాప్ ఇచ్చారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. స్టార్ నిర్మాతలు దిల్ రాజు & శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగ వంశీ, యువి క్రియేషన్స్ విక్రమ్, దర్శకుడు వశిష్ట, శ్రీకాంత్ ఓదెల, బాబీ, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, మైత్రి నవీన్ & రవి, శిరీష్, అశ్విని దత్, రామ్ ఆచంట, శరత్ మరార్, విజయేంద్ర ప్రసాద్, కెఎస్ రామారావు, కెఎల్ నారాయణ, సురేష్ బాబు, వెంకట సతీష్ కిలారు, జెమిని కిరణ్, చుక్కపల్లి అవినాష్, జెమిని కిరణ్, నిమకాయల ప్రసాద్ వంటి చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ బేస్డ్ బ్లాక్‌బస్టర్‌లను రూపొందించే అనిల్ రావిపూడి, హ్యుమర్ అండ్ హై ఎనర్జీతో కూడిన యాక్షన్ కంప్లీట్ ఎంటర్ టైనర్ ని అందించడానికి సిద్ధమైయ్యారు. చిరంజీవిని ఫ్రెష్ అండ్ డైనమిక్ అవతార్‌లో ప్రెజెంట్ చేసే అద్భుతమైన స్క్రీన్‌ప్లేని స్వయంగా రాశారు అనిల్ రావిపూడి. నవ్వులు, భావోద్వేగాలను బ్లెండ్ చేసి మెమరబుల్ ఎంటర్ టైనర్ ని అందించబోతున్నారు. ఇందులో శంకర్ వరప్రసాద్ అనేది మెగాస్టార్ చిరంజీవి పాత్ర పేరు.

ఈ ప్రాజెక్ట్ కోసం సంక్రాంతికి వస్తున్నాం విజయం వెనుక ఉన్న ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ రైటర్స్. ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.

ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – అనిల్ రావిపూడి
నిర్మాతలు – సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ – శ్రీమతి అర్చన
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
డీవోపీ – సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎ ఎస్ ప్రకాష్
ఎడిటర్ – తమ్మిరాజు
రైటర్స్- ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ
Vfx సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
ఎడిషనల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
పీఆర్వో – వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా